Home తాజా వార్తలు కెటిఆర్ పుట్టిన రోజు : కేక్ కట్ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కెటిఆర్ పుట్టిన రోజు : కేక్ కట్ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy Says Birthday Wishes To KTRరంగారెడ్డి : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కెటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని  ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గములో గంట వ్యవధిలో పది వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సబిత ప్రారంభించారు. కొడంగల్ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండల పరిధిలోని గుండ్ల పల్లి,అల్లాపూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు.  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు లక్ష డిక్షనరీల పంపిణీ మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి కెటిఆర్ కు జన్మదిన కానుకగా ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. 250 ఎకరాల అటవీ ప్రాంతంలో   పెద్ద ఎత్తున మొక్కలు నాటడం తో ఆకుపచ్చ గా మారిందని ఆమె చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పరిరక్షించాలని ఆమె కోరారు. అన్ని వర్గాల ప్రజల కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుందని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రైవేటు రంగంలో 14 వేల కంపెనీలు రాగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 14 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించామని మంత్రి చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేయించామని ఆమె వెల్లడించారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.