Thursday, April 25, 2024

జలమయమైన ప్రాంతాలను సందర్శించిన మంత్రి సబితా

- Advertisement -
- Advertisement -

Sabitha indra reddy visit Meer pet

రంగారెడ్డి: ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సందర్శించారు. మీర్ పేట్ కార్పొరేషన్, జల్ పల్లి మునిసిపాలిటీ ల పరిధిలో పర్యటించి స్థానిక ప్రజలతో ఆమె మాట్లాడారు. వర్షాల వల్ల తలెత్తె సమస్యలను గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని, అధికారులను ముందుగానే ఆదేశించినట్లు తెలిపారు. కుండపోతగా కురిసిన వర్షంతో పలు కాలనీల్లో ఇళ్లలో నీరు చేరటంతో వారికి అండగా ఉంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంత్రి సూచించారు. కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలలో అత్యవసర సేవల కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని సబిత తెలిపారు. చెరువులు, నాళాల వద్ద వరద నీరు పోయేలా చెత్త చెదారం తొలిగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నిల్చిన నీటిని తొలిగించటంతో పాటు, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.

మీర్ పెట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్, మిథుల నగర్ ,సత్యసాయి కాలనీ, రెడ్డి బ్యాటరీస్, ఎస్ఎల్ఎన్ఆర్ కాలనీ, శ్రీధర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. జల్ పల్లి మునిసిపాలిటీ లోని ఉస్మాన్ నగర్ లో కూడా మంత్రి సందర్శించడం జరిగింది. బురన్ ఖాన్ చెరువు కు సంబందించి వెంకటాపుర్ తూము వద్ద రాళ్లు, చెత్తను తొలగించాలని కమిషనర్ ను ఆదేశించారు. ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, పాత, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ప్రజలు ఉండవద్దని, అధికారుల సూచనలు పాటించాలని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ నెంబర్ కు సంప్రదించాలని ప్రజలకు తెలియజేశారు. అవసరం ఉంటే సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. జల్ పల్లి మునిసిపాలిటీ పరిధిలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News