Home తాజా వార్తలు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం : సబితా ఇంద్రారెడ్డి

నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం : సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy Visits Model School At Needinooruరంగారెడ్డి : పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గురుకులాలు, మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కందుకూరు మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా నేదునూరులో ఆమె పర్యటించారు. ఈ క్రమంలోనే మోడల్ స్కూల్ ను సందర్శించి స్కూల్ పరిసరాలను, మరుగొడ్లను, మంచినీటి వ్యవస్థను పరిశీలించారు. ఈ స్కూల్ లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కలిపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ స్కూల్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ క్రమంలో మంత్రి స్కూల్ విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.