Home తాజా వార్తలు విద్యలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

విద్యలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

Sabitha lay foundation stone for class rooms in peddemul

 

మనతెలంగాణ/పెద్దేముల్: రాష్ట్రాన్ని విద్యాభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్ఎలు పైలట్ రోహిత్ రెడ్డి, కాలే యాదయ్యలతో కలిసి రూ. 50లక్షల నిధులతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ… పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పించడం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఎన్నో ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలుపరిచి పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సంక్షేమ ఫళాలు అర్హులైన పేద ప్రజలకు చేరవేయాలని సూచించారు.

తదననంతరం కాసేపు విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, డిఈఓ రేణుకదేవి, ఆర్డీఓ అశోక్ కుమార్, తహసీల్దార్ ఫహీం ఖాద్రీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ, డిఎల్‌డిఎ చైర్మన్ నారాయణ రెడ్డి, ఎంపీపీ అనురాధ, జడ్పిటిసి ధారసింగ్, వైస్ ఎంపిపి మధులత, సర్పంచ్ ద్యావరి విజయమ్మ, స్థానిక ఎంపిటిసి అడ్వకెట్ అంబరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి సి.రంగయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌ఎంసి చైర్మన్ ఎల్లారెడ్డి, ఎంపిటిల ఫోరంల అధ్యక్షులు వెంకటేష్ చారి, ధన్సింగ్, నాయకులు సాయిని నారాయణరెడ్డి, గోపాల్ రెడ్డి, క్రిష్ణ గౌడ్, రుక్మాపూర్ రమేష్, పతంగే పాండు, ఉప్పరి మహేందర్, సంఘమేశ్వర్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Sabitha lay foundation stone for class rooms in peddemul