Tuesday, April 23, 2024

స్పీకర్‌ నోటీసులపై సుప్రీంకు వెళ్లనున్న పైలట్

- Advertisement -
- Advertisement -

Sachin pilot now planning to move Supreme Court

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కిరావడం లేదు. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. స్పీకర్ నోటీసులపై మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చిన గడువు నిబంధనలను సచిన్ పైలట్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మూడు రోజుల గడువుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ  నేపథ్యంలో జైపూర్ లో తన వర్గం నేతలతో చర్చలు జరుపుతున్న సచిన్ పైలట్ తనకు వ్యతిరేకంగా వచ్చిన నోటీసులపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.

నోటీసులకు సమాదానం ఇవ్వడానికి కనీసం 7 రోజులు సమయం ఇవ్వాలని నిబంధనలు చెప్తున్న స్పీకర్‌ వాటిని ఉల్లంఘించి నోటీసులు ఇచ్చారని సచిన్ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. కేవలం మూడు రోజులు సమయం ఇవ్వడంపై సచిన్ పైలట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్‌ ఇచ్చిన నోటీసులకు రేపటికల్లా సచిన్ సమాధానం చెప్పాల్సి ఉంది. దీంతో ఈలోపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని పైలట్ భావిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించినందుకు సచిన్ పైలట్ తో పాటు పలువురు అతని వర్గం నేతలను కాంగ్రెస్ పదవులు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

Sachin pilot now planning to move Supreme Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News