Home స్కోర్ ధోనీ మా నాన్నను గుర్తు చేస్తాడు: సచిన్

ధోనీ మా నాన్నను గుర్తు చేస్తాడు: సచిన్

Sachin-and-Dhoni

ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ధోనీని చూస్తే మా నాన్న రమేష్ టెండుల్కర్ గుర్తుకు వస్తారు’ అని అన్నారు. మొదటిసారి ధోనీ కలిసినప్పుడు నాకెంతో గౌరవమిచ్చాడు. అప్పుడే నాకు మా నాన్న గుర్తొచ్చారు. జట్టు గెలిచినా… ఓడినా మహి చాలా నిశ్శబ్దంగా కనిపించేవాడు. మా నాన్న కూడా అంతే. ఏది జరిగినా మౌనంగా ఉంటారు. అందుకే ధోనీని చూస్తే నాకు మా నాన్న గుర్తుకు వచ్చేవారు అని సచిన్ చెప్పుకొచ్చారు. సచిన్ వాళ్ల ఫాదర్ రమేష్ టెండుల్కర్ 1999 మే 19న స్వర్గస్థులయ్యారు. అప్పటి నుంచి సచిన్ అర్ధ శతకం, శతకం సాధించినప్పుడల్లా ఆకాశం వైపు చూస్తూ నాన్నకు అంకితమిస్తూ కనిపించేవారు. ఇక క్రికెట్ దేవుడితో మహీకి ఉన్న అనుబంధమే వేరు. వీరిద్దరూ ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. భారత్ తరపున సుమారు పాతికేళ్లు క్రికెట్ ఆడిన సచిన్‌కు వరల్డ్ కప్ గెలవాలనే కల ఉండేది. అది ధోనీ నాయకత్వంలో 2011లో తీరింది. అందుకేనేమో తాను అనేక మంది కెప్టెన్ల నేతృత్వంలో ఆడిన వారందరిలో ధోనీయే ఉత్తమ సారథి అని అంటారు లిటిల్ మాస్టర్.