Friday, March 29, 2024

సచిన్‌కు అరుదైన పురస్కారం

- Advertisement -
- Advertisement -

బెర్లిన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన తర్వాత భారత క్రికెటర్లు తమ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను భుజాలపై ఎత్తుకుని మైదానంలో ఊరేగించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను సచిన్‌కు ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డును సచిన్ సొంతం చేసుకున్నాడు. లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రధానోత్సవంలో సచిన్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. దీంతో అతనికి ప్రతిష్టాత్మకమైన లారస్ స్పోర్టింగ్ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం స్టీవ్‌వా సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును బహూకరించారు. స్టీవ్‌వా చేతుల మీదుగా సచిన్ అవార్డుకు సంబంధించిన ట్రోఫీని అందుకున్నాడు.
అదో తీపి జ్ఞాపకం
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో తాను పొందిన సంతోషాన్ని మరోసారి నెమరేసుకున్నాడు. ప్రపంచకప్ సాధించడం, అందులో తాను సభ్యుడిగా ఉండడం జీవితంలో మరచి పోలేని అనుభూతిని ఇచ్చింది. ప్రపంచకప్ గెలిచిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అదో అత్యద్భుతం. ప్రతి ఒక్కరూ కలలు గానే ఇలాంటి సంతోష ఘడియలు ఎప్పుడో ఓసారి మాత్రమే లభిస్తాయి. అలాంటి సంతోష క్షణాలను ఆస్వాదించడాన్ని జీవితాంతం తీపి జ్ఞాపకంగా మిగిల్చుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. క్రీడలు మన జీవితాల్లో ఎంత కీలకమో ఇలాంటి చారిత్రక ట్రోఫీలను సాధించినప్పుడూ తెలుస్తుందన్నాడు. ప్రపంచకప్ గెలిచిన మధుర జ్ఞాపకం ఇప్పటికీ తనలో మిగిలే ఉందని సచిన్ వివరించాడు. ప్రపంచకప్ సాధించాలనే కల కోసం 22 ఏళ్ల పాటు ఎదురు చూశా. చివరికి ఆ కల సాకారం కావడంతో జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదించానని తెలిపాడు. తన కెరీర్‌లోనే ఇదే అత్యంత తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నాడు. తన కలను నిజం చేసేందుకు సహచరులు చేసిన కృషిని ఎప్పటికీ మరచి పోనని స్పష్టం చేశాడు. అందరి సమష్టి పోరాటం వల్లే ప్రపంచకప్ సొంతమైందని సచిన్ పేర్కొన్నాడు.

sachin tendulkar Receives Laureus Award

sachin tendulkar Receives Laureus Award

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News