Home తాజా వార్తలు గబ్బర్.. నా రికార్డు నీ వశం చేసుకో: సచిన్

గబ్బర్.. నా రికార్డు నీ వశం చేసుకో: సచిన్

 

Sachin

లండన్: ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయాలు సాధిస్తుండటంతో మాజీ క్రికెటర్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన అనంతరం సచిన్ మీడియాతో మాట్లాడారు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన రికార్డును బద్దలుకొడితే చూడాలని ఉందన్నారు. ఐసిసి నిర్వహించే మ్యాచ్‌ ల్లో ధావన్ ఇప్పటి వరకు ఆరు సెంచరీలు చేశాడు. వరల్డ్ కప్‌లో మూడు శతకాలు, ఛాంపియన్ ట్రోఫీలో మూడు శతకాలు చేసి కుమార సంగక్కర, రికీ పాంటింగ్ సరసన చేరాడు. సౌరవ్ గంగూలీ, సచిన్ ఏడు సెంచరీలో తొలి వరసలో ఉన్నారు. తనపై ఉన్న రికార్డును ధావన్ నీ ఖాతాలో వేసుకోవాలని సచిన్ కోరాడు. ధావన్ పరుగులు చేస్తే భారత బౌలర్లకు కలిసి వస్తోందని, విజయాలకు మంచి పునాది ఏర్పడుతుందని సచిన్ చెప్పారు. ధావన్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు వేళ ఆసీస్‌పై చేసిన శతకం ఊరటనిచ్చిందని, సెంచరీ చేయడంతో పాటు గెలుపులో భాగస్వామ్యైనప్పుడు వచ్చే సంతోషం అద్భుతంగా ఉంటుందని, రూమ్‌కి వెళ్లాక అద్దంలో చూసుకుంటే ఎదో సాధించవన్న తృప్తి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుందని సచిన్ పేర్కొన్నారు.

 

Sachin Wants Dhawan to Break His Record in ICC Matches