Tuesday, April 23, 2024

సాదాబైనామాతో సంబరాల్లో రైతులు

- Advertisement -
- Advertisement -

Sadabainama expires on the 10th of this month

 

* ఎల్లుండితో ముగియనున్న భూముల క్రమబద్ధీకరణకు అవకాశం.
*ఐదెకరాల దాకా ’స్టాంప్ డ్యూటీ’అవసరం లేదు.
*ఉమ్మడి జిల్లా రైతుల్లో హర్షం.
*ఉత్సహాంగా మీసేవ కేంద్రాలకు పరుగులు.
*-ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోటాపోటీగా దరఖాస్తులు.

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ విలిన గ్రామాల్లతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న భువనగిరి బీబినగర్ చౌటుప్పల్ పోచంపల్లి బొమ్మలరామారం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములను క్రమబద్ధీకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరమిచ్చారు. అందులో భాగంగా సాదాబైనామాతో ఐదెకరాల వరకు స్టాంప్ డ్యూటీ అవసరం లేకుండా తమ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు సాదాబైనామాతో తమ భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకు సాదాబైనామాతో భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో, ఈక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మంత్రులు,ఎమెలల్యేలు విలీన గ్రామాల ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.దీంతో ఆదేరోజు సాదాబైనామా కలిగిన విలీన గ్రామాల ప్రజలు తమ భూముల రెగ్యులరైజ్ కోసం నవంబరు 10వ తేదీ రేపటి లోగా దరఖాస్తు చేసుకునే అవకావం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో విలీన గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోతున్నారు. తమ చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. తుది గడువు సమీపించడంతో పెద్దసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు.

తొలిసారి అవకాశం

సాదాబైనామాతో భూములను రెగ్యులర్ చేసుకునే అవకాశం విలీన గ్రామాల ప్రజలకు తొలిసారి లభించింది. ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించిన తర్వాత ప్రభుత్వం గతంలో రెండుసార్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు సాదాబైనామాతో భూములను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించింది. చివరగా 2018లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనూ గ్రామీణ ప్రాంత ప్రజల తమ భూములను సాదాబైనామాతో రెగ్యులరైజ్ చేస్తున్నారు. అప్పట్లో మున్సిపాలిటీలు,కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకు అవకాశం రాలేదు. ఇటీవల మరోసారి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో విలీన గ్రామాల ప్రజలు తమకు ఆ ఉత్తర్వులను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చివరకు వారి కోరిక నెరవేరింది.2014 జూన్ 2లోపు తమ వద్ద సాదాబైనామాలతో మీసేవ కేంద్రాలకు చేరుకుని తమ భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

ప్రయోజనం ఎవరికి..

ముఖ్యంగా సాదాబైనామాతో భూముల రెగ్యులరైజ్ వల్ల ఉమ్మడి జిల్లా పరిధిలోని నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘం పరిధిలోని యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కుర్ మండలంలోని తదితర మండలాల్లోని విలీన గ్రామాల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. ఎందుకంటే హైదరాబాద్ నగర శివారులో ఉన్న బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి, చౌట్టుప్పల్, బొమ్మలరామారం, మండలంలో ఉన్న గ్రామాల్లోని భూములు విలువైనవి, కొన్ని గ్రామాల్లో మార్కెట్ రేటును పక్కనపడితే ప్రభుత్వం నిర్నయించిన ధర ఒక్కో ఎకరానికి రూ.50లక్షల వరకు ఉంది. సాదాబైనామాతో 5 ఎకరాలు ఉన్న వారి భూములను స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేకుండా అధికారలు క్రమబద్దీకరిస్తారు,రెగ్యులరైజ్‌తో వారికి భూములపై హక్కులు కల్పించడమే కాకుండా ధరిణిలో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని అవకాశం దక్కడంతో విలీన గ్రామాల్లోని ప్రజలు సంతోషం వెలిబుచ్చుతున్నారు.పోటాపోటీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

రైతులు సంబురపడుతున్నారు.

విలీన గ్రామాల రైతులు కూడా సాదాబైనామాతో తమ భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంతో రైతులు సంబురపడుతున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూములు రైతుల పేర్లపై నమోదు కాకపోవటంతో నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు సాదాబైనామాతో భూములను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించడంతో ఆ పరిస్థితి ఉండదు. మీసేవ కేంద్రాల్లో ప్రతిరోజు వందల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News