Home తాజా వార్తలు జంతు సంపదను సంరక్షించడమే నా ధ్యేయం…

జంతు సంపదను సంరక్షించడమే నా ధ్యేయం…

Sagar Snake Society

 

జంతుసంపదను కాపాడేందుకు అహర్నిషలు శ్రమిస్తా.
విష జంతువులు కనిపించిన వెంటనే సెల్‌ః 9985545526 కు
సమాచారం అందించండి.. జంతువులను కాపాడుతాం..
సాగర్ స్నేక్ సొసైటి జిల్లా అధ్యక్షులు కృష్ణసాగర్

వనపర్తి : జంతుసంపదను కాపాడేందుకు అహర్నిషలు శ్రమిస్తానని సాగర్ స్నేక్ సొసైటి జిల్లా అధ్యక్షులు కృష్ణసాగర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సాగర్ స్నేక్ సొసైటి జిల్లా అధ్యక్షులు కృష్ణసాగర్ మన తెలంగాణతో ఆదివారం మాట్లాడుతూ రాయినిపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుమలేష్ బావిలో ఒక మొసలి ఉందని తనకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి మొసలిని సురక్షితంగా కాపాడడం జరిగిందన్నారు. వన్య ప్రాణులను రక్షించేందుకు తమ వంతు కృషి చేస్తా మన్నారు.

ఎవరికైనా విష సర్పాలు కనిపిస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రాణులకు హాని తలపెట్టడం మానవ ధర్మం కాదన్నారు. ఎలుగుబంట్లు, మొసళ్లు, విషసర్పాలు అగుపించిన వెం టనే తనకు సమాచారం ఇస్తే తక్షణమే ఆ ప్రదేశానికి చేరుకుంటామని సాగర్ స్నేక్ సొసైటి అధ్యక్షులు కృష్ణ సాగర్ వనపర్తి జిల్లా ప్రజలకు హామి ఇచ్చా రు. వన్యప్రాణులనను కాపాడేందుకు ఎల్ల వేళలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్ స్నేక్ సొసైటి సభ్యులు మోహన్, శివసాగర్, కుమా ర్, రాఘవేందర్, రఘు, శివ, రాజు, మోనప్ప, తిరుమ లేష్, రైతులు ఉన్నారు.

Sagar Snake Society team that saved Crocodile