Thursday, March 28, 2024

‘సాహితీ’ ముంచింది

- Advertisement -
- Advertisement -

ప్లాట్ల పేరిట మోసం చేశారంటూ
కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా

మూడేళ్ల క్రితం వెంచర్ ప్లాట్లకు డబ్బులు కట్టిన
బాధితులు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని ఆరోపణ
రూ.300 కోట్లమేర మోసం జరిగిందని ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి తమను మోసం చేశారని సాహితీ ఇన్‌ఫ్రాటెక్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేశారు. జబ్లీహిల్స్‌లోని సాహితీ కన్‌స్ట్రక్షన్ సంస్థ కార్యాలయం వద్దకు శనివారం ఉదయం వచ్చిన బాధితులు ఆందోళన చేశారు. సాహితీ కన్‌స్ట్రక్షన్ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ వద్ద సాహితీ శర్వాని ఎలైట్ పేరుతో 23 ఎకారల్లో ప్రాజెక్టును ప్రారంభించింది. వెంచర్‌లో 4,300 ప్లాట్లు విక్రయిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 2019, జూన్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రీ లాంచ్ అంటూ కార్యక్ర మం ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించింది. ప్రీ లాంచ్‌లో దాదాపుగా 1,200 మందికిపైగా కస్టమర్లు ప్లాట్లను కొనుగోలు చేశారు.

ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 2023, మార్చి వరకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారని బాధితులు తెలిపా రు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.25లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. సంస్థ ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో, పలుమార్లు సంస్థ ప్రతినిధులను సంప్రదించామని బాధితులు తెలిపారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని, దీంతో తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చేస్తున్నమన్నారు. ఎన్నో ఏళ్లు శ్రమించి దాచుకున్న డబ్బులను ప్లాట్ల కోసం కట్టామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో సంస్థ యజమాని టిటిడి బోర్డు సభ్యుడు లక్ష్మినారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాహితీ బాధితులు సంస్థపై సిసిఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. సిసిఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజారావు భూపాల్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం రావాల్సిందిగా పోలీసులు తెలిపారు. దీంతో బాధితులు వెనుదిరిగి పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News