Saturday, April 20, 2024

సాహిత్య అకాడమి అవార్డుల ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది సాహిత్యంలో ఉత్తమమైన వాటికి కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డులు బహుకరిస్తుంటుంది. ఈ ఏడాది(2022) తమిళనాడుకు చెందిన రచయిత ఎం. రాజేంద్రన్‌కు ఆయన రాసిన నవల ‘కాలా పానీ’కిగాను సాహిత్య అకాడమి అవార్డు లభించింది. ఆయన రాసిందొక చారిత్రక నవల. అది కలయార్‌కొవిల్ లేక కలయార్‌కూల్ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని రాసిన నవల. అవార్డుతో పాటు ఆయనకు రూ. 1లక్ష నగదు, తామ్రం షీల్డ్ బహూకరించారు. ఇక ఇతర బాషల విషయానికొస్తే మధురాంతకం నరేంద్ర రాసిన తెలుగు నవల ‘మనోధర్మపరంగం’కు, కన్నడలో ముదనకూడు చిన్నస్వామి రాసిన ‘బహిత్వాద భారత మత్తు బౌధ్ద తాత్వికతె(వ్యాసాల సంకలనం), మలయాళంలో ఎం. థామస్ మ్యాథ్యూ రాసిన ‘అషాంతే సీథయనం’(సాహితీ విమర్శ)కు, హిందీలో బద్రీ నారాయణ్ రాసిన ‘తుమది కే శబ్ద్’ (కవిత్వం)కు, మరాఠిలో ప్రవీణ్ దశరథ్ బండేకర్ రాసిన నవల ‘ఉజవ్య సోదేచ్య బాహుళ్య’కు, ఒడియాలో గాయత్రిబాల పాండ కవిత్వం ‘దయనది’కి, ఉర్దూలో అనీస్ అష్ఫఖ్ రాసిన నవల ‘ఖ్వాబ్ సరాబ్’కు తదితర మొత్తం 23 బాషల గ్రంథాలకు కూడా సాహిత్య అకాడమి అవార్డులు-2022 దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News