Home తాజా వార్తలు శ్రీకృష్ణదేవరాయలుగా సాయి ధరమ్ తేజ్

శ్రీకృష్ణదేవరాయలుగా సాయి ధరమ్ తేజ్

Mega Hero Sai dharam Tej act as Sri Krishna Devarayaluహైదరాబాద్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. చిత్రలహరి, ప్రతిరోజుపండుగే సినిమాలతో వరుస హిట్లు అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన నో పెళ్లి పాటకు మంచి స్పందన వచ్చింది. దర్శకుడు వీరూ పోట్ల దర్శకత్వంలో వచ్చే పీరియాడిక్ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టు సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా శ్రీకృష్ణ దేవరాయల పాలన నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ రాజు పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను తేజ్, అనీల్ సుంకర నిర్మించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.