Thursday, April 25, 2024

సంక్రాంతి కానుకగా మూవీ పోస్టర్స్

- Advertisement -
- Advertisement -


బ్యాచిలర్ సంక్రాంతి లుక్
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. ఇక మధ్యలో న్యూ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు ఫిల్మ్‌మేకర్స్. తాజాగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల్ ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్‌లో పూజాహెగ్డే… అఖిల్ భుజాలపై చేతులు వేసి చూస్తూ ఉంది. అఖిల్ ఎంతో హుషారుగా దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

విప్లవం అనేది ప్రేమ వల్ల కలిగే ఒక చర్య
హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్టులలో ‘విరాట పర్వం’ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హీరోహీరోయిన్లతో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. ‘విప్లవం అనేది ప్రేమ వల్ల కలిగే ఒక చర్య’ అనే లైన్ కూడా పెట్టారు. ఈ పోస్టర్‌లో ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో నక్సలైట్‌గా రానా కనిపిస్తుండగా… ఆయన చేతిని పట్టుకొని సంప్రదాయ తెలుగింటి అమ్మాయిగా సాయిపల్లవి కనిపిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తే ఈ ఇద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా తెలియజేశారు ఫిల్మ్‌మేకర్స్. ఇక, ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Sai Pallavi and Rana poster released from Virataparvam 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News