Wednesday, April 24, 2024

సాయిపల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం

- Advertisement -
- Advertisement -

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరి’ చిత్రంలోని ఒక్కో పాట రిలీజ్ అవుతూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో మూడో పాట ‘సారంగ దరియా…’ సూపర్ హిట్ అయి 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సినిమా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ “ ఈ మూవీలో రెండు మెయిన్ సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ చేశాను. రెయిన్ పాట, సారంగ దరియా రెండు ప్రధాన పాటలు. సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్. ఆమెతో ఈ డ్యాన్స్ మూమెంట్ రాదు… అని ఎప్పుడూ అనలేము. మేము చెప్పిన మూమెంట్‌ను ఆమె ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం. ఆమె ఉండటం వల్ల ‘సారంగ దరియా…’ సాంగ్ ఇంకా బాగా వచ్చింది. మూడు రోజుల్లో ఈ పాట పూర్తి చేశాము” అని అన్నారు.

Sai Pallavi Classical Dancer says Shekar Master

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News