Friday, April 26, 2024

అసలు పెళ్లే చేసుకోను!

- Advertisement -
- Advertisement -

Sai Pallavi

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా ఎంతో పాపులర్ అయిన తార సాయి పల్లవి. ఈ చిత్రం ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఈ భామకు వరుసగా మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ఈ భామ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది సాయిపల్లవి. హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ను దక్కించుకున్న ఈ భామ పెళ్లిపై స్పందించిన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది.

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? ప్రేమ వివాహం చేసుకుంటావా? అని ప్రశ్నించగా సాయి పల్లవి వెరైటీగా సమాధానమిచ్చింది. “నేను అసలు పెళ్లే చేసుకోను”అని చెప్పింది. జీవితాంతం తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకుంటానంటోంది ఈ అమ్మడు. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తోంది. పెళ్లిపై అమ్మడు స్పందించిన తీరుకు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక వైద్య విద్యను అభ్యసించిన ఈ బ్యూటీ… గతంలో కొన్ని ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లోనూ పాల్గొంది. మంచి డ్యాన్సర్ అయిన సాయి పల్లవికి ఇప్పుడు సౌత్‌లో హీరోయిన్‌గా మంచి పాపులారిటీ ఉంది.

Sai Pallavi shocking comments on Marriage

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News