Friday, March 29, 2024

అదే నా డ్రీమ్ మూవీ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ప్రేమమ్, ఫిదా చిత్రాలతో సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన సాయి పల్లవి ఇప్పటి వరకు పూర్తి స్థాయి తన డాన్స్ ప్రతిభను చూపించలేకపోయాను అంటూ బాధపడుతోందట. హీరోలతో కలిసి చేయడం వల్ల పూర్తి స్థాయి డాన్స్ ప్రతిభను ప్రదర్శించడం సాధ్యం కావడం లేదనేది ఆమె అభిప్రాయమట. అందుకే ఒక డాన్స్ ప్రధానమైన లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయాలని ఆశ పడుతోందట. కథ పూర్తిగా డాన్స్‌పై ఆధారపడి ఉండాలి.. అలాగే అది ఫీమేల్ సెంట్రిక్ మూవీ అయి ఉండాలని సన్నిహితుల వద్ద చెబుతోందట. ఆ మూవీ తన డ్రీమ్ మూవీ అని..ఖచ్చితంగా త్వరలో అలాంటి సినిమాను చేయాలని ఆశపడుతున్నట్లుగా పేర్కొంది ఈ బ్యూటీ. అలాంటి కథతో వస్తే తెలుగు, తమిళం.. ఏ భాషలో అయినా నటించేందుకు సిద్ధంగా ఉందట. ఇప్పటికే ఒకటి, రెండు స్క్రిప్ట్‌లు విన్నా కూడా అవి పూర్తి స్థాయిలో నచ్చలేదట. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘విరాటపర్వం’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, తమిళంలో కలిపి మొత్తం నాలుగు సినిమాల్లో ఆమె నటిస్త్తోందట.

Sai Pallavi wants to full length dance movie

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News