Home నవ విజ్ఞానం ఆర్మిటిక్ రూటులో నౌకాయానం

ఆర్మిటిక్ రూటులో నౌకాయానం

Sailing on the Armintic route

ప్రపంచ స్థాయి భారీ షిప్పింగ్ కంపెనీ ఆర్కిటిక్ మీదుగా దగ్గరి వాణిజ్య మార్గం కోసం ప్రయత్నిస్తోంది. భూతాపం ఫలితంగా మంచు ఖండాలు కరుగుతుండడంతో ఈశాన్య మార్గం తెరుచుకొంటోంది. డేనిష్ సంస్థ మెయిర్‌స్క్ ఈ సందరంగా 3600 కంటైనర్ల కెపాసిటీతో కొత్త నౌకను ద్రువ సముద్రంలోకి మొదటిసారి పంపుతున్నట్టు ప్రకటించింది. ఈ కంటైనర్ వెసల్‌కు వెంటా మెయిర్ స్క్ అని పేరుపెట్టారు. రష్యా మీదనున్న సెయింట్ పీటర్స్‌బర్గ్ వ్లాదిక్‌స్టాక్ నగరాల మధ్య నుంచి ఈ నౌక ప్రయాణిస్తుంది. సాధారణంగా సూయెజ్ కెనాల్ మీదుగా తూర్పు ఆసియా ఐరోపా రూటునే వినియోగిస్తుంటారు. ఈ రూటులో 13000 మైళ్లు (21,000 కి.మీ) ప్రయాణించవలసి రాగా ఇప్పుడు ఆర్కిటిక్ మీదుగా అయితే 8 వేల మైళ్లు 12,800 కి.మీ) మాత్రమే ప్రయాణించవలసి వస్తుంది. ప్రయాణ కాలం 10 నుంచి 15 రోజులు తగ్గుతుంది. ఈ మంచు ఖండాల రూటులో నౌకలు వెళ్లాలంటే మంచు గడ్డలను పగులగొట్టే వ్యవస్థ సహకారం అవసరం, కానీ భూతాపం ఉష్ణోగ్రతల స్థాయిలు పెరగడంతో ఈ రూటులో ప్రయాణించడానికి సులువు ఏర్పడింది.

మెయిర్ స్క్ ప్రయాణం షిప్పింగ్‌కు, ఆర్కిటిక్‌కు చివరి పాయింట్‌గా గుర్తించవలసి వస్తుంది. ఆర్కిటిక్ ఇనిస్టిట్యూట్ (వాషింగ్లన్ డి.సి) సంస్థాపకుడు మాల్టే హుపెర్ట్ ఈ సందర్భంగా తన అభిప్రాయం వివరిస్తూ ఇది పెద్ద మలుపేమీ కాదని, ఒక విధమైన మెరుగైన పరిస్థితి అని పేర్కొన్నారు. మంచు కరగడం వల్ల చాలా విషయాలు ఆర్కిటిక్‌లో సుసాధ్యం అవుతాయని, దాంతోపాటు పర్యావరణానికి వచ్చే చిక్కు కూడా ఉంటుందని అన్నారు. మెయిర్ స్క్ అధికార ప్రతినిధి జనీనా వాన్ స్పాల్డింగ్ కొత్త మంచు రూటు నౌక రషా మీదుగా తన ట్రయల్ జర్నీ వచ్చే నెల ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ నౌక గడ్డకట్టిన చేపల లోడుతో రష్యా పసిఫిక్ రేవు పట్టణం వ్లాడివోస్టాక్‌ను సెప్టెంబర్ 1న విడిచిపెట్టి సెయింట్ పీటర్స్‌బర్గ్ పట్టణానికి బయలుదేరి సెప్టెంబర్ నెలాఖరుకు చేరుకుంటుందని చెప్పారు. వేగంగా పరుగెడుతున్న ప్రపంచంలో కంపెనీలు కొత్తదనం కోరుకుంటాయన్నారు. ఈ ట్రయిల్ మాకు మంచి అవకాశం కల్పిస్తోంది. కొత్త ఏరియాలో ఆపరేషన్ అనుభవం, నౌక వ్యవస్థలను, సిబ్బంది సామర్థాలు పరీక్షించుకోవడానికి, తీర ఆధార ఊతాన్ని ఏర్పర్చుకోవడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. ఏమీ తెలియని రూటులో వెళ్లి తెలుసుకోడానికి, శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడానికి తగినట్టు ఈ ట్రయల్ రూపకల్పన జరిగిందే తప్ప కొత్త ఉత్పత్తిని ప్రారంభించడానికి కాదని వివరించారు.

కెనడా మీదుగా వెళ్లే వాయువ్య మార్గం కన్నా తూర్పు ఆసియా నుంచి ఐరోపాకు ఉత్తరాది సముద్ర మార్గం తక్కువ దూరం గల రూటు అవుతుందని, వాతావరణ మార్పు వల్ల మంచు నుంచి విముక్తి పొందడమే దీనికి కారణంగా పేర్కొన్నారు. ఈ ట్రయల్ రూటు రష్యా అధికార వర్గాల సహకారంతో కొనసాగుతుంది. మంచుగడ్డలను పగులగొట్టే పని రూటు పొడవునా మనుషుల సహాయంతోనే సాగుతుంది. ప్రస్తుతం ఉత్తరాది సముద్ర మార్గం వాణిజ్య ప్రత్యామ్నాయ మార్గంగా తాము చూడడంలేదు అని స్పాల్డింగ్ చెప్పారు. ఈశాన్య మార్గం తొలిసారి వాణిజ్యమార్గంగా 11వ శతాబ్దంలో ప్రతిపాదించారు. రష్యా నావికులు ఈ రూటు అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్య వేగంగా వెళ్లడానికి వీలవుతుందని భావించారు. కాని కొందరు ఇది చాలా దూరంగా అభిప్రాయపడ్డారు. 1878 79 వరకు ఈ రూటు గురించి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఫిన్నిష్ పరిశోధకుడు ఎడాల్ఫ్ ఎరిక్ నార్డెన్సికియోల్డ్ మొదటిసారి ఈ రూటును పూర్తిగా ప్రయాణానికి వీలు అయిన మా ర్గంగా తయారు చేశారు. ఆర్కిటిక్ రూటు వేసవిలో కూడా దట్టమైన సముద్ర మంచుగడ్డలతో కప్పబడి ఉంటుంది. ఈ రోజు కూడా ప్రయాణించడానికి ఇది భయంకరమైన రూటు.

వెంటా మెయిర్‌స్క్ ప్రత్యేకతలు
సెప్టెంబర్ 2018న ప్రయా ణం.
పొడవు 200 మీటర్లు (650 అడుగులు)
వెడల్పు 36 మీటర్లు (118 అడుగులు)
క్యారియర్లు 3600 కంటైనర్లు
నిర్మాణం మెయిర్ స్క్
మంచు పలకల మీదుగా కార్గో త
-మన తెలంగాణ / సెన్స్ విభాగం