Home జాతీయ వార్తలు కరోలినాను ఓడించి తీరుతా: సైనా

కరోలినాను ఓడించి తీరుతా: సైనా

sainaహైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నేహ్వాల్ మంగళవారం ఇండియాకి తిరిగి వచ్చారు. సైనా తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అనంతరం తన కుటుంబికులతో కలిసి ఫోటోలు దిగారు. ఆమె తల్లిదండ్రులు హర్విర్ సింగ్, ఉష రాణిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సైనా మాట్లాడుతూ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిలో తన ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాక రియో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమ వ్యక్తం చేశారు. తన ప్రత్యార్థి కరోలినా మారిన్ చాలా బాగా ఆడిందని, భవిష్యత్తులో ఆమెని ఓడిస్తానని తెలిపారు.