Thursday, April 25, 2024

ఆ నిజాయితీ ‘లవ్ స్టోరి’లోనూ ఉంటుంది

- Advertisement -
- Advertisement -

Saipallavai said about Love story movie

 

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’. ఈ సినిమా శుక్రవారం థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నాయిక సాయిపల్లవి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అప్పటికే ఫిక్స్ అయ్యా…

దర్శకుడు శేఖర్ కమ్ముల నుండి ఈ సినిమా కోసం పిలుపు వచ్చినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని అప్పటికే ఫిక్స్ అయ్యాను. ‘లవ్ స్టోరి‘ లో నా క్యారెక్టర్ విన్న తర్వాత ఇంకా గట్టిగా నటించాలనే కోరిక కలిగింది. – ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్‌కు ‘లవ్ స్టోరి’లో మౌనిక క్యారెక్టర్ కు సంబంధం ఉండదు. రెండు విభిన్నమైన క్యారెక్టర్స్.

మంచి విషయాన్ని చెప్పించారు…

-‘లవ్ స్టోరి’లో చైతూ, నా క్యారెక్టర్ ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మంచి విషయాన్ని చెప్పించారు. అదేంటంటే మనలో ఎవరూ పర్ ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు. కానీ ప్రయత్నించి సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా మా రెండు క్యారెక్టర్స్ తమ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. నేను సాధించగలను అని బలంగా నమ్ముతాయి.

ఏది నమ్ముతారో దాన్నే కథలుగా…

ఈ సినిమాలో మంచి సందేశం ఉన్నా ఎక్కడా బోర్ కొట్టించదు. కథను వినోదాత్మకంగా చూపిస్తూ సినిమాను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో ఉండే నిజాయితీ ‘లవ్ స్టోరి’లోనూ ఉంటుంది. ఆయన తన జీవితంలో ఏది నమ్ముతారో దాన్నే కథలుగా మార్చి సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమా కూడా అందులో ఒకటి.

కంఫర్ట్‌గా ఫీలయ్యా…

— నాగ చైతన్యతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయన రేవంత్ క్యారెక్టర్‌ను పర్‌ఫెక్ట్‌గా ప్లే చేశారు. ఆయనతో పనిచేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను.

తదుపరి చిత్రాలు…

– ప్రస్తుతం నేను తెలుగులో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తున్నాను. ‘విరాట పర్వం’ ఒక రోజు షూటింగ్ ఉంది. ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చివరి దశలో ఉంది. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News