Friday, April 19, 2024

ఆర్‌టిసిలో అప్రెంటీస్‌లు కావాలి

- Advertisement -
- Advertisement -

Sajjanar announces jobs in TSRTC

స్టైపెండ్, బస్‌పాస్ సౌకర్యాలుంటాయి ఎండి సజ్జనార్ ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌ఆర్టీసీలో ఐటీఐ డీజిల్ మెకానిక్, మెటార్ మెకానిక్ విభాగాల్లో అప్రెంటీస్‌ల కోసం ప్రకటన వెలువడింది. ఐటీఐ డీజిల్ మెకానిక్, మెటార్ మెకానిక్ గ్రాడ్యూయేట్స్ కావాలి అంటూ ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్ రీజియన్‌లోని 17 ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ చేయటానికి ఖాళీలున్నాయని తెలిపారు. ఎంపికైన వారికి అప్రెంటిస్‌షిప్ సమయంలో బస్‌పాస్, స్టైపెండ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. డీజిల్ మెకానిక్,మోటార్ మెకానిక్ ట్రేడ్స్‌లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్ సంప్రదించాలని సంస్థ ఎండి సజ్జనార్ కోరారు. ఈ నెంబర్ల ద్వారా 7382814709, 93911 62327, 7382822783 సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News