Wednesday, October 9, 2024

ప్ర‌భాస్ ‘స‌లార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, ‘కేజీఎఫ్’ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండిన్ ప్రాజెక్టు ‘స‌లార్’. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాస‌న్ ప్రభాస్ కు జోడీగా న‌టిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది. కాగా, ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘స‌లార్’ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కాగా, ప్రభాస్ ‘స‌లార్’ మూవీతోపాటు ఆదిపురుష్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ మూవీతో ప్రభాస్ బిజీ కానున్నాడు. ఇక, ప్ర‌భాస్, అందాల భామ పూజా హెగ్డే జంటగా న‌టించిన ‘రాధేశ్యామ్’ మూవీ జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘Salaar’ Movie to release on 2022 April 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News