Home తాజా వార్తలు హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందుతున్న ’సలార్‘

హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందుతున్న ’సలార్‘

Salaar Movie With Hollywood Technologyహైదరాబాద్ :  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ప్రముఖ నటి శృతి హాసన్ నటిస్తున్నారు. భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హాలీవుడ్ టెక్నాలజీని ’సలార్‘ సినిమాకు ఉపయోగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ సినిమా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ’సలార్‘ సినిమాపై ప్రభాస్, శృతి హాసన్ భారీ ఆశలు పెట్టుకున్నారు.