Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచ టెర్రరిస్టుగా సలాహుద్దీన్

ప్రపంచ టెర్రరిస్టుగా సలాహుద్దీన్

 మోడీ – ట్రంప్ భేటీకి ముందు అమెరికా ప్రకటన   భారత్ హర్షం, పాక్ ఖండన 

Salahuddinన్యూఢిల్లీ: సయ్యద్ సలాహుద్దీన్‌ను ప్రపంచ టెర్రరిస్టుగా అమెరికా చేసిన ప్రకటన అతడి కదలికలను, అతడికి అందే నిధులను అరికట్టడంలో ఎంత గానో ఉపయోగపడుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి మంగళవారం నాడు ఇక్కడ అన్నారు. కశ్మీర్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్ ముజాహిద్దీన్ అధిపతి సలాహుద్దీన్. అతడు పాకిస్థాన్‌కు పారిపోయిన పిరికి పంద అని కూడా రాజీవ్ వ్యాఖ్యానించారు. అమెరికా అతడిని టెర్రరిస్టుగా చేసిన ప్రకటన అతన్ని కుంగదీసేది ఖాయమని ఆయన అన్నారు. ఇండో టిబెటన్ సరిహద్దు జవాన్ల కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. సలాహుద్దీన్‌ను ప్రపంచ టెర్రరిస్టుగా సోమవారం నాడు ప్రకటించగా అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఎంతగా టెర్ర రిజం సమస్యను ఎదుర్కొంటున్నాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెర్రరిజం అంతానికి కంకణం కట్టుకున్నామని ఈ చర్యతో అమెరికా ప్రభుత్వం గట్టిగా హెచ్చరించిందని వాషింగ్టన్‌లో విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అమెరికా ప్రకటనపై వ్యాఖ్యానించారు. సమస్యను చాట డంతోపాటు బాధ్యులను గుర్తించిన చర్య అదని ఆయన అన్నారు. అది ఉగ్ర వాదులకు గట్టి హెచ్చరిక అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య మొదటి భేటీకి కొన్ని గంటల ముందు ఈ ప్రకటనను అమె రికా విడుదల చేసింది. సలాహుద్దీన్‌తో అమెరికా పౌరులు ఎటువంటి సం బంధాలు పెట్టుకోరాదని ఈ చర్య ద్వారా నిర్దేశించినట్లు అయింది. అంతకు ముందు నేపాల్‌ల్లో 8,167మీటర్ల దౌలాగిరి పర్వతాన్ని అధిరోహించిన ఇం డో టిబెటన్ సరిహద్దు పోలీసు బలగానికి స్వాగత కార్యక్రమం జరిగింది.
సమర్థనీయం కాదన్న పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్ స్వయం నిర్ణాయక హక్కును సమర్థించే వారిని టెర్రరి స్టులుగా ముద్రవేయడం సమర్ధ నీయం కాదని పాకిస్థాన్ మం గళవారం నాడు అమెరికాను విమర్శించింది. హిజ్బుల్ ముజా హిద్దీ అధిపతి సయ్యద్ సలాహు ద్దీన్‌ను ప్రపంచ టెర్రరిస్టుగా ప్రక టించిన అమెరికాను ఖండి స్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. కశ్మీరీ ప్ర జల న్యాయమైన పోరాటానికి పాకిస్థాన్ తన మద్దతును కొనసా గిస్తుందని ఆ దేశం పేర్కొంది. రాజకీయ, దౌత్య, నైతిక మద్దతును కొన సాగిస్తామని విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రటకనలో పేర్కొంది. కశ్మీరీలు 70 ఏళ్లుగా సాగి స్తున్న పోరాటం న్యాయబ ద్ధమైనదని ఆ శాఖ ప్రతినిధి వ్యా ఖ్యానిం చారు. కశ్మీర్‌లో పద్ధతి ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన సాగు తోందని, ఈ విషయాన్ని స్వతంత్ర మాన వ హక్కుల సంస్థలు ప్రకటించి ఉన్నాయని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. అయి తే ఈ ప్రకటనలో ఎక్కడా సలా హుద్దీన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు.