Home అంతర్జాతీయ వార్తలు హెచ్-1బి వీసా ఉన్నవారి వేతనాలు పెంచాలి

హెచ్-1బి వీసా ఉన్నవారి వేతనాలు పెంచాలి

 అమెరికా కార్మిక కార్యదర్శి అలెగ్జాండర్ సూచన

H1Bవాషింగ్టన్: భారతీయ ఐటి సంస్థలు కోరుకునే హెచ్-1బి వీసాలున్న వారి వేతనాలను ఇప్పుడున్న 60,000 డాలర్ల నుంచి 80,000 డాలర్లకు పెం చాలని అమెరికా కార్మిక కార్యదర్శి అలెగ్జాండర్ అకోస్టా సూచించారు. ‘కాంగ్రెస్ 60,000 డాలర్ల వేతన పరిమితిని అప్‌డేట్ చేయలేదు. ఒకవేళ ద్రవ్యోబల్బణం దృష్టా అప్‌డేట్ చేస్తే చాలా మందికి  80,000 డాలర్ల వర కు పెరుగుతుంది’అని ఆయన కార్మిక, ఆరోగ్య, మానవ సేవలు, విద్య, సంబంధిత సంస్థలపై ఉన్న సెనేట్  ద్రవ్య వినిమయ సబ్‌కమిటీ సభ్యు లకు తెలిపారు. అమెరికాలో తక్కువ జీతాలకు భారతీయులు పనిచేయడం పై సెనేటర్ రిచర్డ్ డర్బిన్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ విష యం చెప్పారు. చికాగోలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ అందులో పని చేస్తున్న 150 మంది ఐటి వర్కర్‌లను తొలగిం చిందని డర్బన్ చెప్పారు. పని లోంచి తొలగిస్తున్న విషయాన్ని కంపెనీ బహిరంగంగా తెలుపదు, వారి స్థానంలో భారత్‌కు చెందిన హెచ్-1బి వీసాదారులకు శిక్షణ ఇచ్చి తీసు కుంటుందని ఆయన వివరించారు.  ఉద్యోగం నుంచి తొలిగే ముందు అమె రికా ఉద్యోగు లు ఈ హెచ్-1బి వీసాదారులకు శిక్షణ ఇచ్చి వైదొలు గుతున్నారని, తర్వాత పనులు భారత్‌కు ఔట్‌సోర్స్ అవుతున్నాయని డర్బన్ అన్నారు.