Home అంతర్జాతీయ వార్తలు నవాజ్ షరీఫ్‌పై సలీంఖాన్ మండిపాటు

నవాజ్ షరీఫ్‌పై సలీంఖాన్ మండిపాటు

SALEEMముంబయి : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై బాలీవుడ్ రచయిత, నటుడు సల్మాన్‌ఖాన్ తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని యురిలో జరిగిన ఉగ్రదాడిలో 18మంది సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈవిషయమై సలీంఖాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నవాజ్ మాటలను పాకిస్థానీలు ఎవరూ వినరని, ఒకప్పుడు తానే చెప్పుకొన్నారని, సైన్యం, పార్లమెంట్, ప్రజలు ఎవరూ వినరు , కనీసం ఆయన మాట కుటుంబీకులైనా వింటారో … లేదో అని నవాజ్ షరీఫ్‌ను సలీం ఖాన్ ఎద్దేవా చేశారు. అలాంటి నవాజ్ షరీఫ్ ఇప్పుడు భారత్ గురించి తప్పుగా చెబితే ఎవరైనా వింటారా …? అని పేర్కొన్నారు. ఆయనకు నవాజ్ షరీఫ్ అని పేరు పెట్టిన వారికి ఆయన వ్యక్తిత్వం ఇలా ఉంటుందని తెలిస్తే, ఆ పేరును బేనవాజ్ శరీర్ అని మారుస్తారంటూ సలీంఖాన్ వ్యాఖ్యానించారు. యురి ఘటనను సలీంఖాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.