Saturday, April 20, 2024

క్రేజీ రీమేక్‌లో మరో మెగాస్టార్

- Advertisement -
- Advertisement -

Salman khan in Lucifer remake?

 

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మలయాళ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే ఈ చిత్రంలో మరో మెగాస్టార్ కూడా కనిపిస్తాడట. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇక ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, – సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News