Home సినిమా పిల్లలు కావాలి.. భార్య వద్దు!

పిల్లలు కావాలి.. భార్య వద్దు!

Salman-Khan

తనకు పిల్లలు కావాలని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ‘భారత్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సల్మాన్ తన వ్యక్తిగత విషయాల గురించి తాజాగా మాట్లాడాడు. తనకు పిల్లల మీద ఆపేక్ష ఉందని…- తనకూ సంతానం కావాలని ఉందని ఈ స్టార్ హీరో చెప్పాడు. ఇప్పటి వరకు బ్యాచిలర్‌గానే ఉండిపోయిన ఈ 53 ఏళ్ల బాలీవుడ్ స్టార్ ఇలా పిల్లలపై మమకారాన్ని చాటుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తనకు పిల్లలు కావాలి కానీ భార్య వద్దు అని సల్మాన్ చెప్పడం విశేషం. అయితే సల్మాన్ ఖాన్ సరోగసి పద్ధతిలో పిల్లలను పొందబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Salman Khan says he wants children