Tuesday, April 23, 2024

రాహుల్ శ్రీరాముడు తపస్సులో ఉన్న యోగి: సల్మాన్ ఖుర్షీద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తమ పారీ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చారు. రాహుల్ గాంధీ మహోన్నతమైన వ్యక్తని, తపస్సు చేస్తున్న యోగి అంటూ ఖుర్షీద్ అభివర్ణించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అపూర్వమైనదంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రస్థాయిలో విమర్శించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు తమ నాయకుడు రాహుల్ పట్ల చూపుతున్న దురభిమానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని దేవుడికే కొలిచే శ్రీరాముడితో పలోల్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే, సల్మాన్ ఖుర్షీద్ మాత్రం తన వ్యాఖ్యలను గటిగా సమర్శించుకున్నారు. భగవంతుడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, కాని శ్రీరాముడు నడిచే దారిలో నడవడానికి అందరూ ప్రయత్నించాలని, ఆ దారిలో ఒక వ్యక్తి నడుస్తున్నారని తాను చెబితే అందుకు అభ్యంతరం ఎందుకని ఖుర్షీద్ బిజెపిని ప్రశ్నించారు. దీనిపై బిజెపి అధికార ప్రతినిధి షెమజాద్ పూనావాలా స్పందిస్తూ భగవంతుడిపైన, దేశంపైన భక్తి కన్నా కాంగ్రెస్ నాయకులకు ఆ కుటుంబంపైనే భక్తి ఎక్కువంటూ పరోక్షంగా సోనియా కుటుంబపైన విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News