Home తాజా వార్తలు మీ సేవలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా…

మీ సేవలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా…

mp santhosh kumar

 

హైదరాబాద్ : ‘ మా అమ్మ ఒక డాక్టర్. ఆమె మీకు సహాయం చేయడానికి నాకు దూరంగా ఉంది. మీరు ఆమెకు సహాయం చేయడానికి దయచేసి ఇంట్లో ఉండండి. ఒక డాక్టర్ కుమారుడు ప్లకార్డులో ఇలా రాసి ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ట్విట్టర్‌లో పంపారు. అందుకు స్పందించిన ఆయన… కోవిడ్ 19 బాధితులను ఆరోగ్యవంతులుగా చేసేందుకు మీరు అవిరామంగంగా సేవలందిస్తున్న, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను. మీ పరిస్థితులను చిత్రాల రూపేణా చూస్తున్న నా హృదయం నుంచి రక్తం కారుతుంది. అని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యం అందిస్తున్న ఆసుపత్రి వర్గాల దీనావస్థను ఫోటోల్లో చూడటంతో మీ సేవలు ఎంత గొప్పగా ఉన్నాయో విదితమవుతోందని పేర్కొన్నారు. ప్రపంచం మీ సేవను ఎప్పటికీ మరిచిపోదు. ఒక నివేదిక రూపేణా మిగిలిపోతుంది అని సంతోష్‌కుమార్ చెప్పారు. మీకు చాలా చాలా దన్యవాదాలు అని చెప్పిన ఆయన వారి కుటుంబ సభ్యుల కోసం, వారి చిన్నారి చేతులకు మద్దతునివ్వండని కోరారు.

 

Salute for your services