Thursday, April 25, 2024

వరల్డ్‌కప్ ముందు ఇంగ్లండ్‌కు షాక్..

- Advertisement -
- Advertisement -

లండన్: ట్వంటీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్‌కు గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఐపిఎల్‌లో చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న శామ్ కరన్ కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం శామ్‌కు వైద్య పరీక్షలుగా నిర్వహించగా గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక త్వరలోనే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో శామ్ కరన్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానంలో టామ్ కరన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, శామ్ దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద లోటుగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ కూడా ఇంగ్లండ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

Sam Curran Ruled out of T20 World Cup with Injured

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News