Saturday, April 20, 2024

ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’..

- Advertisement -
- Advertisement -

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ పూర్తి వినోదాత్మక చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్.

ఈ చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హిలేరియస్ గా ఉంది. శ్రీవిష్ణు చేతిలో వీణ పట్టుకుని కనిపించగా.. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా జాన్ సంగీత వాయిద్యంతో కట్టివేస్తున్నట్లు ఫస్ట్ లుక్ నవ్వులు పూయించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సామజవరగమన పూర్తిగా ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే భావన కలిగిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News