Saturday, January 28, 2023

మొన్న ఉత్తరాఖండ్ ‘బాహుబలి’.. నేడు ఉత్తర్‌ప్రదేశ్ ‘రాయిస్’

- Advertisement -

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఫిబ్రవరి 11 నుంచి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఓటర్లను ఆకట్టుకునేందుక రాజకీయ పార్టీల నేతలు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రధాన పాత్రలో బాహుబలిలోని ‘ఎవ్వరంటా’ పాట మార్ఫింగ్ చేసి అక్కడి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం మరువక ముందే. ఉత్తర్‌ప్రదేశ్ అధికారిక సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హీరోగా షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం రాయిస్ ట్రైలర్‌ను మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసింది.
ఇందులో షారుఖ్‌ఖాన్‌గా అఖిలేష్ యాదవ్, హీరోయిన్ మషీరా ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్రలో నరేంద్ర మోడీని చూపించారు. ఆప్‌లోడ్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియోను దాదాపు మూడు లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోను మీరూ వీక్షించండీ..

https://youtu.be/mScvJGHona4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles