Tuesday, January 31, 2023

సమంతకు ఆ విషయంలో సమస్య!

- Advertisement -

Samantha-Ruth-Prabhuచాలా రోజులుగా పరిచయమున్న వ్యక్తులతో అనుకోకుండా బంధుత్వం కుదిరితే వాళ్లను కొత్తగా ఏమని పిలవాలో అన్న సంశయం రావడం సహజం. ఇప్పుడు సమంతకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. అక్కినేని నాగార్జునతో ఆమెకు ఎప్పటినుంచో పరిచయముంది. ‘మనం’ సినిమాలో వాళ్లిద్దరూ కలిసి నటించారు. అయితే ఇంతకుముందు నాగ్ సార్ అని సంబోధించే సమంతకు ఇప్పుడు తనకు ఆయన్ని ఎలా పిలవాలో తెలియక ఇబ్బందిపడుతోంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను సమంత ప్రేమించడం.. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతుండడం తెలిసిందే. మరి మీ ఇంట్లోకి రాబోయే కోడళ్లు మిమ్మల్ని ఏమని పిలుస్తారని నాగార్జునను అడిగితే.. “నన్ను మామయ్య అని పిలవడానికి నా కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుందేమో. అఖిల్‌కు కాబోయే భార్య శ్రియ భూపాల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను ఆమె నాగ్ మామా అని పిలుస్తుంది. సమంతకే ఈ విషయంలో కొంచెం సమస్య. నన్ను ఎలా పిలుస్తావ్.. అని సమంతను అప్పుడప్పుడు అడుగుతుంటా. తనేమో నవ్వేసి ఊరుకుంటుంది. తనను మామూలుగా నాగ్ సార్ అని సమంత పిలుస్తుందని. అయితే ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని ఆమెకు వార్నింగ్ ఇచ్చాను”అని చెప్పాడు నాగార్జున. అయితే సమంత మాత్రం తనను ఏమని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు నాగార్జున.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles