Wednesday, April 24, 2024

లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌లో…

- Advertisement -
- Advertisement -

Samantha In the Lady Oriented Web Series

 

టాలీవుడ్ స్టార్ హాట్ ముద్దుగుమ్మలు తమన్నా, కాజల్‌లు తాజాగా వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఇక సమంత మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్‌సిరీస్‌తో సక్సెస్‌ను దక్కించుకుంది. ఉత్తరాది ప్రేక్షకులు మొదటి సారి సమంత నటనకు ఫిదా అవుతున్నారు. ఆ వెబ్ సిరీస్ లోని రాజీ పాత్రతో పాన్ ఇండియా రేంజ్ స్టార్‌డమ్‌ను సమంత దక్కించుకుంది. దాంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కు గాను సమంత తీసుకున్న పారితోషికంకు రెట్టింపు పారితోషికంను నెట్ ఫ్లిక్స్ వారు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట. ఒక లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్‌లో సమంతను నటింపజేసేలా వారు ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ దర్శకుడు ఇప్పటికే రెడీ చేసిన స్క్రిప్ట్‌తో నెట్ ప్లిక్స్ వారు సొంతంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌తో సమంత మళ్లీ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్తుందేమో చూడాలి. ఇక తెలుగులో ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అది కాకుండా మరో రెండు ప్రాజెక్ట్‌లు కూడా చర్చల దశలో ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News