Tuesday, November 28, 2023

ఐదో సారి క్రేజీ కాంబినేషన్

- Advertisement -
- Advertisement -

Samantha-Ntr

కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ వేదికగా రాజమౌళి ఈ చిత్ర షూటింగ్‌ను నిరవధికంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ప్రకటించేశారు. మే నెల నుండి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో గత కొద్దిరోజులుగా విపరీతమైన చర్చ నడుస్త్తోంది. త్రివిక్రమ్ మళ్లీ పూజా హెగ్డేనే తీసుకుంటున్నారు అని కొందరు అంటుంటే… లేదు ఈసారి ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక మందన్నను ఎంపిక చేయనున్నారు అంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదేమిటంటే త్రివిక్రమ్… ఎన్టీఆర్‌కి జంటగా సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉండగా ఒక హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్‌లో వచ్చే ఐదవ చిత్రం ఇదవుతుంది. మొదటిసారి ‘బృందావనం’ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ తరువాత రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్, రభస చిత్రాలలో కలిసి నటించడం జరిగింది.

Samantha Joins NTR in Trivikram Srinivas Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News