Home తాజా వార్తలు ‘అందరూ బావుండాలి’ పెద్ద హిట్ కావాలి

‘అందరూ బావుండాలి’ పెద్ద హిట్ కావాలి

Samantha said congratulations to Ali

 

ఆలీ, నరేష్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఇక ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేసి ఆలీ, సినిమా టీమ్‌కి తన అభినందనలు తెలియచేశారు. సమంత మాట్లాడుతూ -“నా ఫేవరేట్ ఆలీ ప్రొడక్షన్‌లో వస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు.