Home తాజా వార్తలు నా భర్త ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో కదా

నా భర్త ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో కదా

Samantha says about her Husband Naga Chaitanya

 

టాలీవుడ్‌లో అక్కినేని నాగచైతన్య, – సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ’ఏమాయ చేసావే’ సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన చైతన్య, – సామ్ ఆ తర్వాత ప్రేమలో పడి కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నారు. ఇక సమంత వివాహం తర్వాత కూడా కెరీర్‌ను నిర్లక్ష్యం చేయకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగానూ తన పని తాను చక్కగా చేసుకుంటోంది సామ్. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న విధానం చూసి ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్య పోతున్నారు. అక్కినేని వంటి పెద్ద కుటుంబంలో అడుగు పెట్టిన సమంత తన కుటుంబంతో.. భర్త నాగచైతన్యతో తన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు దాచుకోకుండా సందర్భం వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా చెబుతూనే ఉంటుంది. ఇక సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. అప్పుడప్పుడూ తన భర్త నాగచైతన్యను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంది సమంత.

కాగా ఇటీవల జరిగిన దగ్గుబాటి రానా, – మిహికా బజాజ్‌ల ఫంక్షన్‌లో నాగచైతన్య, సమంత దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “2020లో ఒక మంచి శుభవార్త చెప్పినందుకు రానా, – మిహీకాలకు థ్యాంక్స్‌” అని పోస్ట్ చేసారు. ఆ తర్వాత భర్త నాగచైతన్య ఫొటోను షేర్ చేసిన సమంత… ఆయనను ఆటపట్టించేలా ఫన్నీగా కామెంట్ చేశారు. “అమ్మ, – ఆంటీ , బంధువులు, – స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సమయం వచ్చింది. చూడండి నా భర్త ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో కదా..? (నా భర్త ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు)” అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు సమంత. నిజంగా ఈ ఫొటోలో చైతూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఫార్మల్ డ్రెస్‌లో నీట్‌గా టక్ చేసి కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా దీనిపై అంతే సరదాగా స్పందించిన నాగచైతన్య.. “ఓకే నౌ.. చూస్తుంటే ఇది ఇతరుల పార్టనర్ షిప్‌తో చేసిన పెయిడ్ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తోంది” అని కామెంట్ చేశారు. వీరి సరదా సంభాషణ చూసి అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.