Friday, March 29, 2024

సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా

- Advertisement -
- Advertisement -

Hajipur judgments

 

హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తీర్పులు వాయిదా పడటంతో నిరాశ చెందారు. హాజీపూర్ కిల్లర్ కేసు తీర్పు వచ్చే నెల 6కి వాయిదా పడగా, ఈ నెల ౩౦వ తేదీకి సమతా కేసు వాయిదా పడింది.

పొదల్లొకి లాక్కెళ్లి గ్యాంగ్‌రేప్, హత్య..
గ్రామాల్లో తిరుగుతూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాదితురాలు సమత ఒంటరిగా వెళ్తుండటాన్ని గమనించిన ముగ్గురు కామాంధులు ఆమెను అపహరించి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశారు. లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివారులో నవంబర్ 24, 2019వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను తొలుత ఎవరూ పట్టించుకోలేదు. దిశ ఘటన తర్వాత ప్రజాసంఘాలు ఆందోళనలు చేయడంతో పోలీసులు స్పందించారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. పోలీసులు కేవలం 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి డిసెంబర్ 14న ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సోమవారం తుది తీర్పు వస్తుందని అంతా భావించారు. అయితే ఈ కేసులో తుదితీర్పు ఈ నెల ౩౦ కి వాయిదా పడింది.

ముగ్గురు మైనర్ బాలికలను
పొట్టనబెట్టుకున్న హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి
లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తూ హాజీపూర్ గ్రామంలో సంచరిస్తూ లిఫ్ట్ పేరిట ముగ్గురు మైనర్ బాలికలను వంచించి వారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య కావించి వారి మృతదేహాలను బావిలో గిరేటాశాడు కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి. ఈ కేసు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనమైంది. కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలని హాజీపూర్ గ్రామస్తులు ఆందోళనలను సైతం నిర్వహించారు. ఈ క్రమంలో కేసు విచారణకు ఏర్పాటైన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు ఈ కేసు విచారణ కొనసాగించింది. దాదాపుగా ౩౦౦ మంది సాక్షులను విచారించింది. 101 మంది వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది.

ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సోమవారం తుది తీర్పుని వెలువరించాల్సి ఉంది. ఇందుకోసం నిందితుడిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చారు. అయితే జడ్జిమెంట్ కాపీ ఇంకా సిద్ధం కానందున న్యాయమూర్తి తీర్పును వచ్చె నెల 6 (ఫిబ్రవరి 6) వ తేదికి వాయిదా వేశారు. దీంతో పోలీసులు నిందితుడిని తిరిగి భువనగిరి జైలుకు తరలించారు. దీంతో శ్రీనివాసరెడ్డికి కఠిన శిక్ష పడుతుందని ఆసక్తిగా ఎదురుచూసిన వారంతా తీర్పు వాయిదాతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Samata and Hajipur judgments postponed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News