Home రంగారెడ్డి సంబురాలకు సై..

సంబురాలకు సై..

year

*నూతన సంవత్సర వేడుకలకు వేదికగా శివార్లు
*ఫాంహౌస్‌లు, రిసార్టులలో సాగుతున్న ఏర్పాట్లు
*మందు, విందుతో పాటు ఇతర సౌకర్యాలు
*అనుమతులు లేకపోతే తాట తీస్తామంటున్న ఖాకీలు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంబరాలకు యువత సన్నద్ధమవుతుంది. హైదరాబాద్ మహానగరంలో తప్పతాగి ఖాకీలకు చిక్కి కటకటాల వెనక్కి పోయి పరువు తీసుకోవడం కన్న శివారు ప్రాంతాలకు తరలివెళ్లి మస్తుగా ఎంజాయ్ చేసి మరుసటి రోజు ఇంటికి చేరుకోవడం వైపు యువత ప్లాన్ చేస్తున్నారు. యువతలో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకో వడానికి ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని పబ్‌లో, క్లబ్‌లు భారీ ఏర్పాట్లు చేసుకోగా తాజాగా నగర శివారులోని రిసార్ట్‌లు సైతం వేడుకలను నిర్వహించుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కందుకూర్, మహేశ్వరం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్, షాద్‌నగర్ ప్రాంతాలలో వెలసిన పలు రిసార్ట్‌లు సన్నద్ధమవుతున్నాయి. కొన్ని రిసార్ట్‌లు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోగా మరికొన్ని రిసార్ట్‌లు కనీస అనుమతులు లేకుండానే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా పరిధిలోని శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్ మండలాల పరిధిలోని పలు రిసార్ట్‌లు సైతం వేడుకలను నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒకటి రెండు రిసార్ట్‌లలో ప్రముఖులతో కార్యక్రమాలు ఉన్న గతం మాదిరిగా సెలబ్రిటీల కార్యక్రమాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఫాంహౌస్‌లలో కుటుంబలతో సందడి చేసుకోవడానికి కొంత మంది తయారవుతుండగా ప్యామీలిల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి సైతం మరికొంత మంది సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని పలు ఫాంహౌస్‌లలో ఇటీవల కాలంలో వెలుగు చూసిన రేవ్‌పార్టీలు, కనీస అనుమతులు లేకుండా డిజెలు ఏర్పాటు చేసుకుని హంగామా చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సైతం సిద్ధం అవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం ఏర్పాట్లు సాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు పట్టణానికి దూరంగా వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎంజాయ్ చేయడానికి యువకులు సిద్దం అవుతున్నారు.
మందు…విందు రెడీ….
నూతన సంవత్సర వేడుకలను మద్యం మత్తులో దూమ్ దామ్‌గా నిర్వహించుకోనుండటంతో మద్యం వ్యాపారులు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లా పరిధిలోని మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున కావలసిన మద్యంను గోదాంలకు తరలించారు. గ్రామాలలో విక్రయించడానికి సైతం బెల్ట్‌షాపుల నిర్వహకులకు మద్యం రేడి అయింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా గంజాయితో పాటు ఇతర మత్తు పదార్దాల వినియోగం పెద్ద ఎత్తున జరుగుతుంది. శివార్లలోని కళాశాల విద్యార్దుల వద్ద గంజాయిని స్వాధినం చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్న వినియోగం మాత్రం అరికట్టలేకపోతున్నారు. కళాశాల విద్యార్దులతో పాటు పలు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు…నూతన సంవత్సర వేడుకలను క్యాష్ చేసుకోవడానికి గంజాయితో పాటు ఇతర మత్తు పదార్దాలను విక్రయించే ముఠాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని కొన్ని రిసార్ట్‌లలు మందు, విందుతో పాటు ఇతర సౌకర్యాలను సైతం సమకూర్చుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలను కావలసిన కేక్‌లు, స్వీట్లు తయారు దారులు సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రకాల కేక్‌లను తయారు చేయడంతో పాటు డెలివరీ సౌకర్యం కల్పించి ప్రత్యేక అఫర్‌లు అందచేస్తున్నారు.
ఇంగ్లీషు నూతన సంవత్సరమంటు ప్రచారం…..
నూతన సంవత్సర వేడుకలను మస్త్ ఎంజాయ్‌గా నిర్వహించుకోవడానికి యువత సిద్దం అవుతుండగా మరోవైపు తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ఉగాధి పర్వదీనం నుంచి నిర్వహించుకునే అలవాటు చేసుకోవాలని ఇంగ్లీషు నూతన సంవత్సరంను మనం నిర్వహించుకోవడం ఎమిటని పలువురు పెర్కొంటున్నారు. ఎపి ప్రభుత్వం దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీచేయగా చిల్కూర్ దేవాలయ పూజారి రంగరాజన్ సైతం ప్రభుత్వ నిర్ణయంను స్వాగతిస్తు చిల్కూర్ బాలాజీ దేవాలయంకు వచ్చే భక్తులు సైతం అంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలపాలి తప్ప నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పవద్దని అసలు నిర్వహించకపోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేయడం చర్చణీయాంశంగా మారింది. ఈ నెల 30 శనివారం, 31 ఆదివారం రావడంతో వీకెండ్ పార్టీలకు మాత్రం యువత సిద్దం అవుతున్నారు. పోలీసులు మాత్రం కనీస అనుమతులు లేకుండా నూతన సంవత్సర వేడుకలతో పేరుతో హంగామా చేసిన తాగి వాహనాలతో రోడ్ల మీదకు వచ్చిన కఠినంగా వ్యవహరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.