Home వార్తలు అచ్చం అలానే..

అచ్చం అలానే..

Untitled-22మూడోటెస్టు తొలిరోజూ బౌలర్లదే హవా

మొదటిరోజే 12 వికెట్లు  భారత్ తొలిఇన్నింగ్స్ 215  దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్ 11/2

నాగ్‌పూర్: గాంధీ-మండేలా సిరీస్‌లో భాగంగా జరిగిన తొలిరెండు టెస్టుల్లోలాగే మూడోటెస్టులోనూ తొలిఇన్నింగ్స్ ఆరంభించిన జట్టు మొదటిరోజే కుప్పకూలింది. బుధవారంమిక్కడి జమతా మైదానంలో ఆరంభమైన మూడోటెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటిరోజే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్(3/35) సూపర్ స్పెల్‌కు తోడు స్పిన్నర్ హర్మర్(4/78) స్పిన్ మ్యాజిక్ జతకావడంతో కోహ్లిసేన 78.2 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఓపెనర్ మురళీవిజయ్(84 బంతుల్లో 40, 3×4, 1×6) టాస్‌స్కోరర్ కాగా వికెట్ కీపర్ వృద్ధిమాన్‌సాహా(106 బంతుల్లో 32, 4×4), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(54 బంతుల్లో 36, 6×4) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్ర దమైన స్కోరు అందించారు. అనంతరం తొలిఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆటము గిసే సమయానికి 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్(7), ఆమ్లా(0) ఉండగా, వాన్‌జిల్(0)ను అశ్విన్.. తాహీర్‌ను జడేజా పెవిలియన్‌కు చేర్చారు.
ధావన్ మళ్లీ.. : ఈ సిరీస్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న డాషింగ్ ఓపెనర్ శిఖర్‌ధావన్(12) మళ్లీ విఫలమయ్యాడు. ఓ ఎండ్‌లో మరో ఓపెనర్ మురళీవిజయ్ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డు నడిపించినా.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ధావన్ పార్ట్ స్పిన్నర్ డీన్ ఎల్గర్‌కు రిటర్న్‌క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరికొద్దిసేపటికే విజయ్.. మోర్కెల్ సంధించిన అద్భుత బంతికి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా(21), కెప్టెన్ కోహ్లి(22) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తూ సింగిల్స్ రొటేట్ చేయడంతో భారత్ స్కోరుబోర్డు 100 మార్కుకు చేరువైంది. అయితే పుజారాను స్పిన్నర్ హర్మర్ అవుట్ చేయడంతో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. పుజారా నిష్క్రమించిన కొద్దిసేపటికే రెండోస్పెల్‌కు దిగిన పేసర్ మోర్కెల్ తన వరుస ఓవర్లలో రహానె(13), కోహ్లిలను అవుట్ చేసి భారత్‌ను దెబ్బతీయగా, రెండేళ్ల తరువాత సొంతగడ్డపై తొలిటెస్టు ఆడుతున్న రోహిత్.. హర్మర్ బౌలింగ్‌లో డివిల్లియర్స్‌కు క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు. దీంతో 94/2తో ఉన్న భారత్ 125/6కు చేరింది.
జడేజా ఎదురుదాడి : ఈ స్థితిలో వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లపై ఆల్‌రౌండర్ జడేజా ఎదురుదాడి చేశాడు. ఓ ఎండ్‌లో సాహా చక్కగా స్ట్రయిక్ రొటేట్ చేయగా, జడేజా చెత్తబంతులను బౌండరీకి తరలించాడు. అయితే ఏడోవికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తరువాత ధాటిగా ఆడుతున్న జడేజాను రబడ క్లీన్‌బౌల్డ్ చేయగా, ఆ వెంటనే సాహాను హర్మర్ పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో అశ్విన్ పరుగులు చేయడానికి ప్రయత్నించినా మిశ్రా(3), ఇశాంత్(0)ల నుంచి అతనికి మద్దతు లభించలేదు.
వేట మొదలాయె..
భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆటముగిసే సమయానికి ఓపెనర్ వాన్‌జిల్(0), నైట్‌వా చ్‌మెన్ ఇమ్రాన్‌తాహీర్(4) వికెట్లను కోల్పోయింది. వికెట్లు కోల్పోకుండా తొలి రోజును ముగించాలని భావించిన దక్షిణా ఫ్రికాను స్పిన్నర్లు అశ్విన్, జడేజా దెబ్బతీశారు.