Saturday, April 20, 2024

ఢిల్లీలోని ఎన్‌సిబి ఆఫీస్‌కు వాంఖడే

- Advertisement -
- Advertisement -
Sameer Wankhede reaches NCB office in Delhi
దర్యాప్తు కోసం కాదన్న విజిలెన్స్ అధికారి జ్ఞానేశ్వర్

న్యూఢిల్లీ/ముంబయి: క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి) ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మంగళవారం ఢిల్లీలోని ఎన్‌సిబి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. వెనక ద్వారం నుంచి వెళ్లిన ఆయన అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఎన్‌సిబి సీనియర్ అధికారులతో వాంఖడే చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్(డిజి) ఎస్‌ఎన్ ప్రధాన్‌ని వాంఖడే కలిశారా..?లేదా..? అన్నది తెలియదు. ఎన్‌సిబికి చెందిన వివిధ జోనల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్‌ఖాన్ తండ్రి,బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ నుంచి రూ.25 కోట్లు దర్యాప్తు అధికారులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై జరుగుతున్న విజిలెన్స్ విచారణకు ఎన్‌సిబి ఉత్తరప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డిడిజి) జ్ఞానేశ్వర్‌సింగ్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వర్‌ను విలేకరులు ప్రశ్నించగా, తన దర్యాప్తు కోసం ప్రస్తుతానికి తానెవరినీ పిలవలేదన్నారు. అవసరమైనపడు ఆయణ్ని(వాంఖడేను) పిలుస్తానన్నారు. మంగళవారం తాను ముంబయికి వెళ్లడం లేదని జ్ఞానేశ్వర్ తెలిపారు. సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తనకు ఎవరూ సమన్లు జారీ చేయలేదని, తాను ఓ పని మీద అక్కడికి వెళ్లినట్టు వాంఖడే చెప్పడం గమనార్హం. డ్రగ్స్ కేసులో సాక్షి అయిన ప్రభాకర్‌సాయిల్ తనపై ఆరోపణలతో దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ సోమవారం ప్రత్యేక కోర్టులో వాంఖడే వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.

వాంఖడే మా బంధువుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు:  మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్

ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ ఆరోపించారు. దీనిపై తాను ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్(డిజి) ఎస్‌ఎన్ ప్రధాన్‌కు లేఖ రాశానని మాలిక్ తెలిపారు. ముంబయి,థానేల్లోని కొందరి ఫోన్లను ఇద్దరు వ్యక్తుల ద్వారా వాంఖడే ట్యాపింగ్ చేయిస్తున్నారని మాలిక్ ఆరోపించారు. వాంఖడేపై జరుగుతున్న దర్యాప్తులో తన లేఖలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని డిజిని కోరినట్టు మాలిక్ తెలిపారు. తన కుటుంబసభ్యుల కాల్ వివరాలు ఇవ్వాలని ఓ పోలీస్ స్టేషన్‌ను వాంఖడే ఆదేశించారని మాలిక్ తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై ముంబయిలోని కోర్టులో వాంఖడే సోమవారం ఓ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేయించే టార్గెట్‌తో ఓ ప్రముఖ రాజకీయ నేత(ఎన్‌సిపి నేత నవాబ్‌మాలిక్) ప్రయత్నిస్తున్నారని ఆ అఫిడవిట్‌లో వాంఖడే ఆరోపించారు. ఆ నేత సమీప బంధువు సమీర్‌ఖాన్‌ను ఎన్‌సిబి అరెస్ట్ చేసినందునే తనను టార్గెట్ చేశారని అఫిడవిట్‌లో వాంఖడే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News