Home తాజా వార్తలు సమ్మెహనం నటుడు అమిత్ పురోహిత్ కన్నుమూత

సమ్మెహనం నటుడు అమిత్ పురోహిత్ కన్నుమూత

Actor Amit Purohitహైదరాబాద్ :  సుధీర్‌ బాబు హీరోగా వచ్చిన సమ్మెహనం సినిమాలో అదితి రావ్‌ హైదరీ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మృతి చెందాడు. ఈ సినిమాతోనే  అమిత్  మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  బుధవారం సాయంత్ర అమిత్ మరణించినట్టుగా సుధీర్ బాబు ట్వీట్ చేశారు. ఓ  మంచి యువ నటుడ్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హీరోయిన్ అదితి రావ్‌ హైదరీ, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణలు కూడా అమిత్‌ మృతిపై సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. హిందీలో పంక్‌, ఆలాప్‌ తదితర సినిమాల్లో అమిత్ నటించారు. అయితే అమిత్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

Sammohanam Actor Amit Purohit Passed Away