Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి గెలాక్సీ ఎఫ్42 5జి

మార్కెట్లోకి గెలాక్సీ ఎఫ్42 5జి

Samsung galaxy F42 5G mobile was launched

 

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్ మొట్టమొదటి ఎఫ్ సిరీస్‌లో 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్42 5జి పేరిట ఆవిష్కరించిన ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో తెచ్చింది. ఫీచర్లను చూస్తే, నైట్ మోడ్‌తో 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఈ విభాగంలో అత్యద్భుతమైన 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, 12 బ్యాండ్స్ 5జి సపోర్ట్‌ను కలిగిన గెలాక్సీ ఎఫ్42 5జి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. 6జిబి+128జిబి ధర రూ.20,999, 8జిబి+128జిబి ధర 22,999 రూపాయలుగా ఉంది. రెండు రంగులు- మ్యాటీ బ్లాక్, మ్యాటీ ఆక్వాలో లభ్యమయ్యే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్స్‌లో భాగంగా అక్టోబర్ 3న అందుబాటులోకి వచ్చింది.

Samsung galaxy F42 5G mobile was launched