Home టెక్ ట్రెండ్స్ శాంసంగ్ నుంచి ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల

శాంసంగ్ నుంచి ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Samsung-Galaxy-M30sముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎం 30ఎస్ పేరిట ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేతో పాటు, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ కెమెరాలున్నాయి. 6000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉందని సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ ఓపాల్ బ్లాక్, సఫైర్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్ లో రిలీజ్ కాగా దీనికి చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.13,999 అందుబాటులో ఉండగా… 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.16,999లకు కస్టమర్లకు అందిస్తున్నారు. అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ షాప్‌లో సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమ్ముతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో…

6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్

4/6 జిబి ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0, డ్యుయల్ సిమ్, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy M30s smartphone price in India