Home టెక్ ట్రెండ్స్ శాంసంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్4

శాంసంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్4

Samsong

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఇందులో పలు అద్భుత ఫీచర్లను యూజర్లకు అందివ్వనుంది శాంసంగ్ సంస్థ. దీని ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు. త్వరలో జరగనున్న ఐఎఫ్‌ఎ 2018 ప్రదర్శనలో ఈ ట్యాబ్లెట్ పిసిని విడుదల చేయనున్నట్టు సమాచారం.

గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ఫీచర్లు…

గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ట్యాబ్లెట్ పిసిలో 10.5 ఇంచ్ డిస్‌ప్లే

2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్

12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 8.1 ఒరియో, 7300 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ తదితర అద్భుత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.