న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ సామ్సంగ్ భారతదేశం మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ12ను విడుదల చేసింది. ఈ ఏడాది భారత్లోకి వచ్చిన తొలి గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్ఫోన్ ఇది. 6.5 అంగుళా హెచ్డి+ ఇన్ఫినిటీవి డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం, 15డబ్లు అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్ వంటివి ఉన్నాయి. మూడు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.12,999, 4జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ స్టోర్లు, సామ్సంగ్.కామ్, ఆన్లైన్ మార్కెట్లలో ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులోకి వచ్చింది.