Wednesday, March 22, 2023

స్థానిక అవసరాలకు ఇసుకను మొబైల్ ద్వారా పొందవచ్చు

- Advertisement -

conference*2004-2014 వరకు ఆదాయం
రూ.3940కోట్లు
*ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక
*రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,గనుల శాఖ
మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు స్థానిక అవసరాలకు సరిపడు ఇసుకను అతి చౌక్‌గా పొందుటకు మీ సేవా,ఆన్‌లైన్ లేదా టెలిఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,గనుల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నా రు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లులు, పోలీస్ కమిషనర్లు, ఎస్‌పిలతో ఇసుక రవాణపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భ ంగా మంత్రి మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు ఇసుకపై ప్రభుత్వానికి 39-40 కోట్ల ఆదాయం వచ్చిందని,అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత మూ డున్నర నాలుగు సంవత్సరాలలో 1307 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అ మలు జరుగుచున్న ఇసుక పాలసీని ఆరు రాష్ట్రాల ప్ర భుత్వాలు స్టడీ చేసి అక్కడ అమలు చేస్తున్నామని తెలిపారు. అయినా సామాన్య ప్రజలకు ఇబ్బ ందులు కలుగకు ండా 31 జిల్లాలలో ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే తక్కువ ధరకు సరఫరా చేసేలా సాండ్ టాక్సి విధానం అమలులోకి తెస్తున్నామని తెలిపారు. ఎడ్ల బండ్లపై ఇసుకను తీసికెళ్లే ప్రజలను ఆపకూడదని మంత్రి ఆదేశించారు. అలాగే స్థా నిక అవసరాలకు వాడుకునే ఇసుక ట్రాక్టర్లను ఆపవద్దని అన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా దారులపై చర్యలు తీసుకోవాలని, సామాన్య జనానికి ఇబ్బంది క ల్గకుంగా చూడాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, మైనింగ్ ఎడి కోదండ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News