Home జోగులాంబ గద్వాల్ తోడేస్తున్న తోడేళ్లు

తోడేస్తున్న తోడేళ్లు

తుంగభద్రనదిలో ఇసుకను యథేచ్చేగా దోపిడీ చేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర తోడేళ్లు
ధనార్జనే ధ్యేయంగా బడాబాబుల లూటీ
అడ్డూ, అదుపులేని ఇసుక అక్రమ రవాణా

Sand-Mafia

గద్వాల ప్రతినిధి,మానవపాడు: ఇసుక… ఇసుక… ఇపుడు ఇది బంగారం కంటే కూడ ప్రియమైంది… కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు సులభంగా డబ్బును సంపాదించాలనే యావతో పెద్ద మాఫీయాగా తయ్యారైయ్యారు.. ఈక్రమంలోనే అవినీ తికి మారుపేరుగా ఉన్న కొందరు అధికారులతో చెలి మి చేశారు… ఇంకేముంది… ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా యధేచ్చగా ఇసుకను తోడేస్తున్నారు… ఒక పక్క కలెక్టర్, ఎస్పీలు అక్రమ ఇసుక రవాణపై ఉక్కుపా దం మోపుతూ… హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇసుక మాఫీయా మాత్రం వాటిని భేఖాతరు చేస్తు దండిగా డ బ్బును సంపాదించుకుంటున్నారు..

ఈ అక్రమ వ్యవ హారం ఎక్కడి దాకా వెళ్లిందంటే…. నిఘా వర్గాల ద్వా రా ఏకంగా సీఎం పేషీకే చేరిందంటే ఇక్కడ ఇసుక మా ఫీయా తోడేళ్లు ఏస్థాయిలో అక్రమాలకు పాల్పడుతు న్నారో స్పష్టమవుతుంది… సీఎం పేషీకి చేరిన నివేధిక లో ముఖ్యంగా జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల తో పాటు, కొందరు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి పేర్లు కూడ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చిం ది.. అధేవిధంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడ అధికార పార్టీ నేతలే మాఫీయాగా ఏర్పడి ఇసుక దంధా చేస్తున్నట్లు గుర్తించారు.. అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏమంటే ఎవరు అధికారంలో ఉంటే వారు దోచుకోవచ్చన్నది స్పష్టమవుతుంది…

ఆనలుగురే దోచేస్తున్నారు….:

ప్రధానంగా మన ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవా ణ చేస్తున్నది ఆనలుగురే అన్నది చీకటి ప్రపంచానికే కాదు…బాహ్య ప్రపంచానికి కూడ తెలుసు. వీరు అలంపూరు నియోజకవర్గంలో ఇటిక్యాల, వడ్డేపల్లి, మండలాలు గద్వాల నియోజకవర్గంలో గద్వాల, మల్ద కల్ మండలాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని కోడి కి…. కాదు…కాదు…. చీమలను అడిగిన చెబుతాయి. అంతటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు… ఇక ప్రజాప్రతినిధుల వరకు వస్తే అలంపూరు నియో జకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి ఏకంగా లారీ, టిప్ప ర్, ట్రాక్టర్‌లను బట్టి రేటును ఫిక్స్ చేశారు.. తనకు రా వాల్సిన మామూళ్లు సమయానికి రాకపోతే… ఈయన ఏకంగా జాతీయ రహదారిపై వచ్చి ఉన్నతాధికా రులతో ఫోన్‌లో మాట్లాడుతూ నానా హంగామా చేస్తా రనే ప్రచారం బలంగా ఉంది. ఇక పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడ కర్నూల్ జిల్లాకు చెందిన కొంద రు అధికార పార్టీ నేతలే అక్రమ ఇసుక రవాణాను చేస్తున్నారు.

రోజుకు రూ.10లక్షల సంపాదన…:

* బహిరంగ మార్కెట్‌లో ఇసుక విలువ సుమారు ఇలా ఉంది. * జోగుళాంబ గద్వాలలో ఇలా…:
* టిప్పర్ ఇసుక రూ.35-40 వేల వరకు ఉంది. (25క్యుబిక్కు మీటర్లు) * లారీ ఇసుక రూ.25-35 వేల వరకు, (20క్యుబిక్కు మీటర్లు) *ట్రాక్టర్ ఇసుక రూ.5-6వేల వరకు (5క్యుబిక్కు మీటర్లు)

హైదారాబాదులో ఇలా…..:

*టిప్పర్ ఇసుక రూ.60-70వేల వరకు ఉంది.
*లారీ ఇసుక రూ.45-50వేల వరకు ఉంది.
*టాక్టర్ ఇసుక రూ.8-9వేల వరకు ఉంది.

ఇలా ఇసుక మాఫీయా రోజుకు సుమారు రూ.పది లక్షల విలువ కలిగిన ఇసుకను తోడేస్తు జేబులు నింపు కుంటున్నారని సీఎం ఫేసీలో ఉన్న ఇసుకాసురుల అక్రమ సంపాదన లిస్టు చెబుతుంది.

*సాధారణంగా అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకా రం క్యుబిక్కు మీటరుకు రూ.600, వ్యాట్ 14శాతం, రవాణ కిలో మీటరు చొప్పున చార్జీలు వేస్తారు. కాని ఇసుక మాఫీయా ఇసుకను చెరపట్టడంతో బంగారం కంటే కూడ ధర ఎక్కువ పలుకుతుంది.

తెలంగాణ ఇసుకను తరలిస్తున్న సీమాంధ్రులు

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇసుక తరలింపుపై ఆంక్షలు విధించింది. పొరుగు రాష్ట్రమైన ఏపిలో ఇసుక తరలింపును సరళతరం చేసింది. దీంతో పక్క రాష్ట్ర ఇసుక మాఫియా తెలంగాణ ప్రాంతంలోని ఇసుకపై కన్నేసింది. యధేచ్చగా తోడేస్తున్నారు. నది ఆవలి నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇసుకను నది గుండా ఆవలికి చేరుస్తున్నారు. డిసెంబర్ ౩౦న ఏపి లోని కర్నూలు జిల్లా నిడ్జూరు గ్రామానికి చెందిన ఆరు ఇసుక ట్రాక్టర్లను కలుగొట్లలో పట్టుకొని ఉండ వెల్లి పోలీసు స్టేషన్‌కు తరలించటం ఇందుకు నిదర్శ నం. అడపాదడపా చేస్తున్న దాడులలో కర్నూలు జిల్లా కు చెందిన దాదాపు 20 ట్రాక్టర్లు పట్టు పడ్డాయి.