Thursday, April 25, 2024

రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

- Advertisement -
- Advertisement -

యథేచ్ఛగా సాగుతున్న మట్టి దందా


మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి : జిల్లాలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. దీంతో జిల్లాలోని విలువైన గుట్టలు మాఫీయా చేతుల్లో కరిగిపోతున్నాయి. గుట్టలు ఎక్కడ క నిపించినా వాటిని తవ్వి మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించి అక్రమ మట్టి వ్యాపారాలకు తెరలేపుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా మట్టిని తరలిస్తున్న అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా యి. దీంతో అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో వెలసిన ప్రైవేటు వెంచర్‌లకు, ఇండ్ల నిర్మాణాలకు మట్టి చాల అవసరం ఉంది. దీంతో గద్వాల మండల పరిధిలోని జమ్మిచేడు, కొత్తపల్లి, శెట్టి ఆత్మకూ రు, చెనుగోనిపల్లి, బీరెల్లి, అనంతపురం, తదితర గ్రామాలలో గుట్టలు, ప్రభుత్వ స్థలాల నుంచి అక్రమంగా తవ్వి న మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్య ంగా రాత్రి 10 గంటల తర్వాత మట్టి తవ్వకాలు చేపట్టి… రాత్రి వేళ్లలో టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల్ ద్వారా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రాత్రి వేళలో మట్టిని తరలించడానికి ఎలాంటి అనుమతులు లేవు. కాని మట్టి మాఫియా రాత్రి వేళ్లలోనే తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నా రు. మట్టిమాఫీయా అడ్డుకట్టవేయాల్సిన మైనింగ్, రెవె న్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టన్నట్లు వ్యహరిస్తున్నారని అధికారులు తగు చర్యలు తీసుకొని అక్రమ మట్టి తవ్వకాలు నిలువరించి, ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధ్దంగా తవ్వకాలు
గుట్టలు, ప్రభుత్వ భూములలో మట్టి తవ్వకాలకు అధికారుల అనుమతి ఇవ్వాల్సి ఉంటుం ది. ఇచ్చిన అనుమతి మేరకు మైనింగ్ శాఖకు పన్ను చెల్లించాలి. క్యూబిక్ మీటర్ చొప్పున ధ ర చెల్లించాకే మట్టి తవ్వకాలు జరపాలి. రెం డు శాఖల అధికారుల సమక్షంలో మట్టి తవ్వకాలు జరుపాలి కానీ ఈ నిబంధనలేవి అమలుకావడం లేదు. అక్రమార్కులు ఇస్టానుశారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు గుట్టలను తవ్వేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రకృతి సంపదను కొల్లగొడుతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదనే అరోణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా రైతులు తమ పంట పొలా ల్లో తవ్విన మట్టిని ఒక ప్రాంతం నుంచి వేరొక్క ప్రాం తానికి తరలించాలంటే ఖచ్చితంగా మైనింగ్ అధికారుల అనుమతులు అవసరం. కాని ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్న కూడా అధికారులు మట్టిమాఫీయాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News